రెబల్ స్టార్
ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్
మూవీ లలో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే
ప్రభాస్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ సినిమాలలో వర్షం
మూవీ కూడా ఒకటి. వర్షం
మూవీ ఆ సమయంలో
రెబల్ స్టార్ ప్రభాస్ కు
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అదిరిపోయే క్రేజ్ ను తీసుకువచ్చింది. వర్షం
మూవీ లో
ప్రభాస్ సరసన
త్రిష హీరోయిన్ గా నటించగా , శోభన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించగా , సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ
మూవీ ని ఎం ఎస్ రాజు నిర్మించాడు. వర్షం
మూవీ ని 14
జనవరి 2004 వ సంవత్సరం భారీ ఎత్తున
థియేటర్ లలో విడుదల చేశారు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని
బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర కురిపించింది.
ఈ
మూవీ ద్వారా
ప్రభాస్ , త్రిష క్రేజ్ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. అలాగే ఈ
మూవీ విజయంలో దేవి
శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ
బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న వర్షం
మూవీ ని తిరిగి మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వర్షం
మూవీ ని
నవంబర్ 11 వ తేదీన మళ్లీ
థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రెబల్ మరియు బిల్లా సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ
మూవీ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మరి వర్షం
మూవీ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.