శిరీష్ కు ఊహించని భంగపాటు !

Seetha Sailaja
అల్లు శిరీష్ ఎన్ని ఫ్లాప్ లు ఎదురైనా హీరోగా రాణించాలి అన్న గట్టి సంకల్పంతో ఉన్నాడు. అల్లు కాంపౌండ్ అండదండలు ఉన్నప్పటికీ శిరీష్ రకరకాల కారణాలతో రాణించలేకపోతున్నాడు. దీనితో నేడు విడుదల కాబోతున్న ‘ఊర్వశివో రాక్షశివో’ మూవీ ఫలితం పై శిరీష్ చాల ఆశలు పెట్టుకున్నాడు. మూడు సంవత్సరాల గ్యాప్ తరువాత విడుదల కాబోతున్న ఈమూవీ శిరీష్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది.


శిరీష్ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటాడు. గతంలో అతడు ఒక సామాజిక సమస్య పై మాట్లాడిన మాటలు ఇప్పుడు శిరీష్ లేటెస్ట్ మూవీకి సమస్యగా మారుతాయా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. గతంలో శిరీష్ మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ కొందరు శిరీష్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడమే కాకుండా అతడి వ్యక్తిగత జేవితం పై కూడ టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.


ఇటీవల శిరీష్ ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక కాలేజీ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలను అతడి గతంలో చేసిన కామెంట్స్ ను జత చేస్తూ అతడి పై ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఒకవిధంగా ప్రస్తుతం సినిమా తారలు అదేవిధంగా రాజకీయ నాయకులు ఏమి మాట్లాడినా అవి క్షణాలలో వైరల్ గా మారిపోతున్నాయి.



గతంలో అదే రాజకీయ నాయకులు లేదడంతే సినిమా సెలెబ్రెటీలు మాట్లాడిన మాటలకు నేటి మాటలకు తేడాను చూపెడుతూ ట్రోలింగ్ చేయడం నటిజన్స్ కు అలవాటుగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఏమి మాట్లాడినా అది పోరాపాటుగా మారి వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే విధంగా మారుతోంది. మరీ ముఖ్యంగా సినిమా సేలేబ్రేతీలు ఈ వ్యక్తిగత ట్రోలింగ్ వల్ల తాము నటించిన సినిమాల విడుదల సమయంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. దీనితో మన నోటి వెంట వచ్చే మాటలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చే సమస్యలు ఏమిటో శిరీష్ కు బాగా అర్థం అయింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: