వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన నాగచైతన్య "థాంక్యూ" మూవీ..!

frame వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన నాగచైతన్య "థాంక్యూ" మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే అనేక విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి ,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్య "థాంక్యూ" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా , రాసి కన్నా ఈ మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు.

ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో థాంక్యూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా మెప్పించ లేక పోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అల్లరించడానికి రెడీ అయింది. ఈ మూవీ సాటిలైట్ హక్కులను జెమిని సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని త్వరలోనే జెమినీ సంస్థ తమ ఛానల్ లో ప్రసారం చేయబోతుంది.

మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయిన థాంక్యూ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య "దూత" అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో పాటు నాగ చైతన్య ,  వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: