నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ తో మంచి ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ గా కనిపించనుండగా , వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ పనులు పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి , బాలకృష్ణ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఇప్పటికే అనిల్ రావిపూడి , బాలకృష్ణ తో తెరకెక్కించబోయే మూవీ కి టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు ఒక వార్త అవుతుంది. బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి "రామారావు గారు" అనే టైటిల్ ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.