హీరోయిన్ అనుకి ఇదే చివరి అవకాశమా..!!

Divya
హీరో అల్లు శిరీష్ డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వం లో వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ -2 బ్యానర్ లో సుదీర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తూ ఉన్నది. ఇక ఈ సినిమాలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయెల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక టీజర్,ట్రైలర్ లో కూడా వీరిద్దరి రొమాన్స్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి సోలోగా చేస్తున్న సినిమా ఇది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది.


కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పటికే తెలుగులో వెనుకబడిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటుందా అంటూ అభిమానులు భావిస్తూ ఉన్నారు.అను ఇమ్మాన్యుయెల్ కు ఇదే చిట్ట చివరి అవకాశం అని తెలియజేస్తున్నారు. అల్లు శిరీష్ కి కూడా ఈ సినిమా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఎందుచేత అంటే ఇప్పటివరకు సరైన సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సినిమాలో అల్లు శిరీష్,అను ఇమ్మాన్యుయెల్ రెచ్చిపోయి నటించారు.మరి ఇప్పుడైనా వీరిద్దరిని ఈ సినిమా గట్టెక్కిస్తుందా లేదా అన్న విషయం చూడాలి.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ హాట్ నెస్ తో ఆడియన్స్ ని అలరిస్తే ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు సైతం భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే మరిన్ని అవకాశాలు వెలుపడతాయి. ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లకు దీటుగా తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు కచ్చితంగా పలు సినిమాలలో అవకాశాలు వస్తాయి అని అభిమానులు సైతం తెలియజేస్తు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: