సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం బుల్లితెర నటి మృతి..!!

frame సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం బుల్లితెర నటి మృతి..!!

Divya
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కామర్లతో యువ తమిళ సంగీత దర్శకుడు మరణించిన వార్త మరువకముందే.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తల్లి గుండెపోటుతో నిన్నటి రోజున హాస్పిటల్ లో చేరారు.. ప్రముఖ బెంగాలి నటి సోనాలి చక్రవర్తి తాజాగా మరణించింది. కొంతకాలంగా ఏమీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఈమె కోల్కతాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించారట. ఈ క్రమంలో నిన్నటి రోజున ఇమే అనారోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్లు సమాచారం. ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు భార్య మరణ వార్తతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది.

పాపులర్ సీరియల్ యాక్టర్ భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని మృతి చెందింది. కన్నడ ,తమిళ్ భాషలలో నటించి దర్శక నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళ్యాణ్ కుమార్ కొడుకే ఈ భరత్ కళ్యాణ్. భరత్ భార్య ప్రియదర్శిని కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉండేది. ముఖ్యంగా భర్తతో కలిసి ఎన్నో పలు రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె కూడా కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయిందని.. గత కొద్ది వారాలుగా మంచం పైనే ఉన్నదని సమాచారం.
ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం విషమించడంతో నిన్నటి రోజున ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచినట్లు సమాచారం. అయితే ఆమె మరణానికి డైట్ మార్పులే కారణమన్నట్లుగా తెలుస్తోంది కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ తీసుకోవడం మొదలుపెట్టిందట. దీంతో సడన్గా జరిగిన ఈ ఆహారం మార్పుల వల్ల ఆమె శరీరంలో షుగర్స్ లెవెల్ పడిపోయి ఆ తర్వాత సీరియస్ కావడంతో మూడు నెలల పాటు చెన్నైలో ఒక హాస్పిటల్లో చేర్పించారట. ఆ తర్వాత కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. 2007లో వచ్చిన శ్రీరంగం అనే తమిళ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చారు భరత్.A

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: