
అందరూ బాగుండాలి అందులో మేముండాలి అంటున్న నరేష్..!!
ఆ తర్వాత నరేష్ కూడా తన మూడవ భార్య గురించి తీవ్రంగా విమర్శలు చేశాడు. ఆ వివాదం తర్వాత నరేష్, పవిత్ర ఇద్దరు చాలా సైలెంట్ అయ్యి బయట ఎక్కడ కనిపించలేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో మళ్లీ వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా వీరిద్దరూ అలీ హీరోగా నటించిన’అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అని సినిమాలో వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటించారు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ క్రమంలో ఒక వీడియో చేసి..ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ వీరిద్దరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియోలో నరేష్ పవిత్ర భుజాల మీద చేతులు వేసి..” సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది..సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా స్పందిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయని మరోసారి మా సినిమా నిరూపించింది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి” అంటూ నరేష్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.