తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దళపతి విజయ్ , వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. తమిళ్ లో ఈ మూవీ వరసు అనే టైటిల్ తో విడుదల కానుండగా , తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది.
ఈ మూవీ తమిళ్ లో రూపొందుతూ ఉండగా తెలుగు లో డబ్ అయ్యి విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన , దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వరసు మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
ఈ మూవీ యూనిట్ ఏ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఏ తేదీన విడుదల చేయబోయేది మాత్రం అధికారికంగా ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వరిసు మూవీ ని 11 జనవరి 2023 వ తేదీన గాని , 12 జనవరి 2023 వ తేదీన గాని విడుదల చేయాలి అని ఈ మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూ వీపై అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.