యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన విజయాన్ని మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మూవీ యూనిట్ చేసి చాలా కాలం అవుతుంది. మధ్యలో కొన్ని రోజుల క్రితం ఈ మూవీ అప్పుడు స్టార్ట్ కాబోతుంది ... ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాక పోతే ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ లుక్ కోసం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడానికి అంతా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తేరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రెండవ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.