సమంతతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది... వరలక్ష్మి శరత్ కుమార్..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ , మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ "క్రాక్" మూవీ లో జయమ్మ అనే పాత్రలో నటించింది. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర అద్భుతంగా ఉండడంతో ,  ఈ పాత్రకు ప్రేక్షకుల నుండి విమర్శకుల , నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.


అలాగే క్రాక్ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వరలక్ష్మి శరత్ కుమార్ కు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ "యశోద" అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కింది. యశోద మూవీ నవంబర్ 11 వ తేదీన తెలుగు ,  తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.


ఇది ఇలా ఉంటే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ , సమంత గురించి మాట్లాడుతూ ... సమంత తో కలిసి వర్క్ చేయడం చాలా సరదాగా ఉంటుంది అని చెప్పు కొచ్చింది. షూటింగ్ లో గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని ,  షాట్ కు ముందు జోక్స్ ఎందుకు వేస్తావు అని సమంత నవ్వేది అని వరలక్ష్మి శరత్ కుమార్ గుర్తు చేసుకుంది.  అలాగే సినిమా కోసం సమంత చాలా కష్ట పడింది అని వరలక్ష్మి శరత్ కుమార్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: