
బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాకే?
ఇకపోతే ఇలాంటి సమయంలోనే మరో కొత్త చర్చ కూడా తెరమీదకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి త్వరలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుంది అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి పంపించే కంటెస్టెంట్ ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధం చేసేసారు అని సోషల్ మీడియాలో రూమర్స్ ఊపందుకున్నాయి. ఇక ఇలా వైల్డ్ కార్డు ఇంటి ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్ ఎవరో కాదు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వర్షిని అన్నది తెలుస్తుంది. వర్షిని వైల్డ్ కార్డు ఎంట్రీ కి సమయం ఆసన్నమైందని ఇక మరికొన్ని రోజుల్లో వర్షిని బిగ్ బాస్ ఇంట్లో కనిపించబోతుందని అందరూ చర్చించుకుంటున్నారు.
ఇక వర్షిని ఇప్పటికే రూల్స్ ప్రకారం క్వారంటైన్ కూడా కంప్లీట్ చేసుకుందట. ఇక కొంతమంది బిగ్ బాస్ ప్రేక్షకులు ఇది నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు. ఒకవేళ వర్షిని నిజంగానే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళింది అంటే హౌస్ లో మరొక కలర్ ఫుల్ అందం యాడ్ అయినట్లే అవుతుంది అని చెప్పాలి. ఇక యాంకర్ వర్షినిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం ద్వారా షో రేటింగ్ పెంచుకోవాలనే ప్లాన్లో ఉన్నారట ఆ బిగ్ బాస్ నిర్వాకులు.. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.