చిరంజీవిని ఈసారి ఈ చిత్రమైనా గట్టెక్కిస్తుందా..?

Divya
ఇక చిరంజీవి చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. డైరెక్టర్ మెహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లూసిఫర్ సినిమాకు రీమేకుగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో గాడ్ ఫాదర్ సినిమా చివరికి నష్టాలను మిగిల్చిందని వార్తలు వినిపించాయి. చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నది.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అంచనాలు ఒక వర్గం ప్రేక్షకులను గట్టిగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రవితేజ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత హైప్ పెరిగింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా చిరంజీవికి తగ్గట్టుగానే ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి విడుదల చేసిన గత మూడు చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయట.

ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి నటించిన ప్రతి సినిమా కూడా నష్టాలని మిగిల్చినట్లు సమాచారం. కేవలం సైరా నరసింహారెడ్డి సినిమా కు పెట్టుబడి పెట్టిన కాస్త వెనక్కి వచ్చిందని సమాచారం. ఇక గాడ్ ఫాదర్ ఓవర్సీస్ గా రూ.6 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి తన తదుపరి చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టి నటించాలని ఆయన అభిమానుల సైతం భావిస్తున్నారు. ముఖ్యంగా రీమిక్స్ సినిమాలను వదిలేసి మంచి కథలను ఎంచుకోవాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు మెగా అభిమానులు. మరి చిరంజీవిని ఈ చిత్రమైన ఈసారి చిరంజీవిని గట్టేకెక్కిస్తుందా అంటూ మరికొంతమంది అభిమానులు సందిగ్ధంలో ఉన్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: