ఆ కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను... బండ్ల గణేష్..!

Pulgam Srinivas
నటుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ,  ఆ తర్వాత నిర్మాత గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు మూవీ తో నిర్మాతగా మారాడు.


ఆ తర్వాత అనేక మూవీ లకు బండ్ల గణేష్ నిర్మాత గా వ్యవహరించాడు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో గబ్బర్ సింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాల నిర్మాణంలో చాలా వరకు స్లో అయ్యాడు. కొన్ని రోజుల క్రితమే బండ్ల గణేష్ "డేగల బాబ్జి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.


తాజాగా బండ్ల గణేష్ తన సోషల్ మీడియా వేదికగా రాజకీయాలకు దూరంగా ఉండే విషయం గురించి స్పందిస్తూ ... నమస్కారం నా కుటుంబ బాధ్యతలు వల్ల ... నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో ... వారి కోరికపై ... మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ...  నాకున్న పనుల వల్ల ... వ్యాపారాల వల్ల ... నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను.  నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ ... మిత్రుత్వం గాని లేదు. అందరూ నాకు ఆత్మీయలే ... అందరూ నాకు సమానులే ... ఇంతకు ముందు నా వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా గాని ... పరోక్షంగా గాని ... బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్ అని సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: