తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న
యువ హీరో లలో ఒకరు అయిన
సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
హీరో ఇప్పటికే పేపర్ బాయ్ , ఏక్
మినీ కథ , మంచి రోజులు వచ్చాయి
మూవీ లతో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా
సంతోష్ శోభన్ , మారుతీ దర్శకత్వంలో మెహరీన్
హీరోయిన్ గా తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే
సంతోష్ శోభన్ తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్ అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీcలో ఫరీయా అబ్దుల్లా
హీరోయిన్ గా నటించగా , మేర్లపాక గాంధీ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
ఈ
మూవీ ని
నవంబర్ 4 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను చేసింది. అలాగే ఈ ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ఎప్పుడు ... ఎక్కడ ... ఏ సమయానికి జరగబోతుంది అనే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది. తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్
మూవీ యూనిట్ ఈ
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ది వెస్టిన్ ,
హైదరాబాద్ లో జరగనున్నట్లు , అలాగే ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు నాచురల్ స్టార్
నాని ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు సంబంధించిన
పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.