మరో సారి అలాంటి సన్నివేశాలు చెయ్యను అంటున్న మిల్క్ బ్యూటీ..!!
అంతలా తన అందంతో అందరిని తెగ ఇబ్బంది పెట్టేసింది తమన్నా.. ఒక్కొక్కసారి ఈమె అందాన్ని వర్ణించడానికి కవులకు కూడా పదాలు దొరకపోవచ్చు ఏమో మనకు అనిపిస్తుంది. ఇప్పటికే తన అందంతో కుర్ర కారును సైతం కట్టిపడేసే ముద్దుగుమ్మ తమన్నా అందం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈమెకు వయసు పెరుగుతున్నా సరే అందాలు మాత్రం అసలు తగ్గట్లేదు.
ప్రేమ, పెళ్లి రూమర్స్ వంటి వాటికి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ కుర్రాళ్ళకు ఎప్పుడు చమటలు పట్టిస్తూనే ఉంది. ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా సినిమాల నుంచి తప్పుకొని వైవాహిక జీవితంలో చాలా బిజీ అయిపోతే.. ఈమె మాత్రం రెస్టు తీసుకోకుండా సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతోంది. మొన్నటివరకు యంగ్ హీరోల పక్కన చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సీనియర్ హీరోల పక్కన నటిస్తోంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో నే కూడా ప్రేక్షకులను అల్లరిస్తున్న ఈమె ఇప్పటికీ కూడా ఇదే ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తోంది.తన ఫిజిక్ తో ఆకట్టుకుంటొంది. కానీ ఇప్పటివరకు శృంగార భరితమైన సన్నివేశాలు ఆమె ఎప్పుడూ చేయలేదు. అడిగినా కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చింది.
కేవలం ఒక బాహుబలి 1 సినిమాలో మాత్రమే చిన్నపాటి సీన్లు నటించింది ఈ బ్యూటీ. అది కూడా మితిమీరి మనకు కనిపించదు. అయితే కెరియర్ ప్రారంభంలోనే ఇలాంటి మితిమీరిన సన్నివేశాలు, లిప్ లాక్ లు కూడా చేయకూడదని ముందే నిర్ణయించుకున్నారట మిల్క్ బ్యూటీ. అయితే కెరియర్ ప్రారంభంలో కొంతమంది అలాంటి సన్నివేశాలలో మాత్రమే చేయాలని తెగ ఇబ్బంది పెట్టే వారట. కానీ మొహమాటం లేకుండా చెయ్యను అని అలాంటి పాత్రలకు తాను దూరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చిందట తమన్న. తాజాగా F3సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకుంది తమన్నా. ఇక త్వరలోనే మరిన్ని సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు బాగా కోరుకుంటున్నారు.