నాగార్జున కు హై కోర్ట్ నుంచి నోటీసులు...!!
ఏ సినిమాలో నటించిన ఆ సినిమా లాభాలను తెచ్చి పెట్టడం లేదు. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కు హోస్టుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.ఇక ఈ సీజన్ చాలా చెత్త టీఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకొని ఈ సీజన్ దారుణంగా ఫెయిల్ అయింది అంటూ చాలామంది నెటిజెన్స్ చేత విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో తాజాగా నాగార్జునకు మరో షాకింగ్ న్యూస్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి నాగార్జున ఇంటికి నోటీసులు జారీ చేసింది.
బిగ్ బాస్ రియాల్టీ షోను ఆపివేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు ఈ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున ఇంటికి నోటీసులు జారీ చేసిందట.. అంతేగాక ఈ షో నిర్వహించే వాళ్ళకు కూడా నోటీసులు పంపించింది. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం హైకోర్టు నుండి ఈ నోటీసులు దాఖలు అయ్యాయి. అలాగే ఈ నోటీసు అందిన వాళ్ళందరూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కోర్టు ఈ పిటిషన్ గురించి విచారణ జరపడానికి 14 రోజులకు వాయిదా వేసిందట.. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు అక్కినేని నాగార్జున ఈ సీజన్ తర్వాత ఇక బిగ్ బాస్ షో కి దూరమయ్యే అవకాశం ఉందని చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.
బిగ్ బాస్ షో ఇప్పటికే 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ షో డిసెంబర్ రెండో వారానికి కంప్లీట్ కానుంది అని తెలుస్తోంది. ఇక నాగార్జునకు కోర్టు నుండి నోటీసులు అందాయని తెలియడంతో చాలామంది అయ్యో పాపం నాగార్జున అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున షూటింగ్లకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యనే విడుదలైన ది గోస్ట్ సినిమా నాగార్జునకు అంతగా సక్సెస్ అందించలేదు. ఆర్థికంగా కూడా నష్టాల్లో వేసింది అని టాక్. ఇక నాగార్జున తన ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయల పారితోషకాన్ని అందుకుంటున్నారు. ఆరు పదుల వయసు వచ్చినా కూడా నాగార్జున తన జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికి కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారట..