ఆ తమిళ స్టార్ హీరో చేతుల మీదగా విడుదల కానున్న సమంత "యశోద" మూవీ ట్రైలర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. సమంత పోయిన సంవత్సరం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తరికెక్కిన పుష్ప ది రైస్ అనే మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ లో సమంత తన హాట్ హాట్ అంద చందాలతో మరియు తన డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన తెలుగు ,  తమిళ , కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.
 


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా తమిళ ట్రైలర్ ను అక్టోబర్ 27 వ తేదీన సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన సూర్య విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: