"ఊర్వశివో రాక్షసివో" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక పిక్స్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌరవం మూవీ తో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన అల్లో శిరీష్ ఆ తర్వాత అనేక మూవీ లలో హీరోగా నటించాడు. అందులో శ్రీరస్తు శుభమస్తు సినిమా అల్లు శిరీష్ కు మంచి విజయాన్ని ,  మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా ,  రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు.  చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఆ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు.
 


ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్ కపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ ,  ఈవెంట్ జరిగే తేదీని మరియు ఈవెంట్ జరిగే స్థలాన్ని. కూడా అధికారికంగా ప్రకటించింది. ఊర్వశివో రాక్షసివో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 30 వ తేదీన ఆదివారం రోజున "జే ఆర్ సి" కన్వెన్షన్ హైదరాబాద్ లో జరగనున్నట్లు ,  ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: