ఎన్టీఆర్ లో వచ్చిన మార్పు గొప్పదంటున్నా నేటిజన్లు.....!!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఎంత అగ్రెసివ్,యాటిట్యూడ్‌తో ఉండేవాడో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఉన్న ఎన్టీఆర్ వేరు.. ఇప్పుడున్న ఎన్టీఆర్ వేరు. చదువుకోవాల్సిన వయసులోనే ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేశాడు. టీనేజ్‌లోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు. ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాని సమయంలోనే యాక్టింగ్‌తో అందరినీ మెప్పించేశాడు. అలా ఎన్టీఆర్ ఊపు మీదున్న సమయంలో.. అది వయసు వల్లో, పొగరు వల్లో.. కావాలనే అలా అన్నాడో.. తన ఫ్యామిలీయే గొప్ప అనే భ్రమలో ఉన్నాడో ఏమో గానీ.. చిరంజీవి అంటే ఎవరు. నాకు తెలీదు అని అనేశాడు.అప్పట్లో అది పెను సంచలనంగా మారింది. మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య మరింత దూరాన్ని పెంచినట్టు అయింది. ఇప్పటికీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ రామ్ చరణ్‌, ఎన్టీఆర్ స్నేహం మాత్రం దానికి అతీతంగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ కంటే ముందే వారి స్నేహం ఎంతో బలంగా ఉంది. ఈ స్నేహాన్ని చూస్తే ఆర్ఆర్ఆర్ కోసం ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అలా అందరికీ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ స్నేహం గురించి మరింతగా తెలిసింది.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు ఇద్దరూ కూడా ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఎంతో మెచ్యూర్డ్‌గా మాట్లాడుతుంటారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఏ ఒక్కరూ కూడా ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. రాజమౌళి అయితే తన ఇద్దరు హీరోలను సమానంగానే చూస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం జపాన్‌లో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. అయితే అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్, యాక్టర్ ఎవరు అని అక్కడి మీడియా ప్రశ్నించింది. అయితే దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. రామ్ చరణ్ నాన్న చిరంజీవి గారు ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు చిరంజీవి ఎవరు? అని అడిగిన ఎన్టీఆర్.. ఇప్పుడు అదే చిరంజీవి గురించి ఇలా చెప్పేశాడు. అయినా కాలం మనిషిలో ఎంతో మార్పును తీసుకొస్తుంటుందనే దానికి ఇదే ఉదాహరణ. ఒకప్పుడు చరణ్‌ కూడా ఎంతో అగ్రెసివ్, యాటిట్యూడ్‌తో ఉండేవాడు. కానీ ఇప్పుడు అతనిలోనూ ఎంతో మార్పు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: