ఒక ఫ్లాప్ సినిమా కోసం.. ప్రభాస్ రెండు సూపర్ హిట్ లు వదులుకున్నాడట?
అతని నటన యాక్షన్ చూసిన తర్వాత సినిమా చేస్తే ఇలాంటి హీరోతోనే చేయాలి అని దర్శక నిర్మాతలు అందరూ కూడా ఫిక్స్ అయ్యారు అని చెప్పాలి. ఇక పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు కూడా ప్రభాస్తో ఒక్క సినిమా చేసిన చాలు క్యూ కట్టారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు సైతం ఇక ప్రభాస్ డేట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేశారట. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన ఆర్య సినిమాను మొదట ప్రభాస్ కి వినిపించారట సుకుమార్.
ప్రస్తుతం మాస్ ఇమేజ్ సంపాదించానని.. ఇలాంటి సమయంలో ఇక లవ్ స్టోరీ చేస్తే జనాలు చూస్తారో చూడరో అని చెప్పి ఇక ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట ప్రభాస్. ఆ తర్వాత బోయపాటి శ్రీను రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన భద్ర మూవీ స్టోరీని కూడా అటు ప్రభాస్ కి వినిపించారట. కానీ ఎందుకో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు ప్రభాస్. ఇక ఓ రోజు దిల్ రాజు వంశీ పైడిపల్లి కలిసి మున్నా అనే సినిమా కథను వినిపించగా.. ప్రభాస్ మున్నా మూవీ కొత్తగా ఉందని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఫ్యాన్స్ కి నచ్చుతుంది అని నమ్మకంతో ఓకే చేశారట.కానీ ప్రభాస్ వదులుకున్న ఆర్య, భద్ర సినిమాలు సూపర్ హిట్స్ సాధిస్తే ఇక ప్రభాస్ ఏరుకోరి ఎంచుకున్న మున్నా సినిమా మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోయింది అని చెప్పాలి.