సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన సమంత..!!
అక్టోబర్ 27వ తేదీన యశోద సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుంద కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విభిన్నంగా ఉంటుంది అని అభిమానుల సైతం భావిస్తున్నారు. సమంత రెగ్యులర్ కమర్షియల్ పాత్రులకు ఈ చిత్రం చాలా భిన్నంగా ఉంటుంది అని చిత్ర బృందం కూడా తెలియజేయడం జరిగింది. సమంత అభిమానులు టీజర్ చూసిన తర్వాత కొంతమంది నిరుత్సాహాన్ని కూడా తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా మొత్తం సమంతనే చూడాల్సి ఉంటుందా అంటూ మరికొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం సమంతాను అన్ని రకాలుగా యశోద సినిమా లో చూపిస్తారని నమ్మకంతో ఉన్నామని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా పైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సమంత ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ చాలా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సమంత చేతులు శాకుంతలం , ఖుషి తదితర చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత యశోద సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.