నిర్మాత బండ్ల గణేష్ కొన్న టపాసుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

murali krishna
నిర్మాత బండ్ల గణేష్ ఏ పని చేసినా కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగా చేస్తుంటాడు అయన. సినిమాలు తీసినా కూడా అంతే స్థాయిలో తీస్తుంటాడు మరి.

పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు అంటూ ఉంటాడు. ఇప్పుడు తీస్తే కూడా పెద్ద హీరోతో పెద్ద సినిమానే తీస్తాను అని అంటాడు. అలా బడా నిర్మాతగా బండ్ల గణేష్ ఖాతాలో చాలా బ్లాక్ బస్టర్ హిట్లున్నాయి. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. రాజకీయాలకు మళ్లీ దగ్గరవుతున్నట్టుగా మనకి అనిపిస్తోంది.

సినిమాల్లో ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా.. సోషల్ మీడియాలో మాత్రం  బాగా యాక్టివ్‌గానే ఉంటాడు. ట్విట్టర్‌లో తన ఫాలోవర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు బండ్ల,ట్విట్టర్‌లో బండ్లన్న వెంటనే రియాక్ట్ అవుతుంటాడు. ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా చేతనైంత చేస్తుంటాడు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేశాడు మరీ

బండ్ల గణేష్ ప్రతీ దీపావళికి టపాసులు కొంటాడు. వాటిని ఇంటి ముందున్న వరండాలో పేర్చుతాడు. వాటిని ముందు నిల్చుని అలా ఫోటో దిగుతాడు. ఊరంతా సరిపోయే టపాసులను కొంటాడా ఇతగాడు? అని అందరికీ అనుమానం వచ్చేది. గత రెండేళ్ల నుంచి బండ్ల గణేష్ ఇలానే చేస్తూ ఉన్నాడు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు.

అయితే ఈ ఏడాది మాత్రం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో బయటకు చెప్పాడు. మీడియాతో మాట్లాడుతూ.. అసలు సంగతి చెప్పేశాడు బండ్లన్న. నాలుగు లక్షల విలువైన టపాసులను కొనేశాడట బండ్లన్న. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెట్టేశారు మరీ. వామ్మో బండ్లన్న మామూలోడు కాదు.. బండ్లన్నతో అట్లుంటది అంటూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే బండ్ల గణేష్ ఇందులో చాలా మటుకు గిఫ్టులుగా అందరికీ పంపిస్తాడని తెలుస్తోంది.

బండ్లన్న ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో మాట్లాడిన మాటలు, ఆడియో లీకుల మీద నోరు విప్పడం, త్రివిక్రమ్‌ను తాను తిట్టానని ఒప్పుకోవడం అన్నీ కూడా సోషల్ మీడియాలో  బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరి బండ్లన్న సినిమాలను నిర్మిస్తాడా? లేదా రాజకీయాల్లో బిజీ అవుతాడా? అన్నది చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: