మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయిన శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. గబ్బర్ సింగ్మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను , అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శృతి హాసన్ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే ఆ మధ్యలో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ ప్రస్తుతం మళ్ళీ వరుస మూవీ లలో నటిస్తూ తన జోష్ ను చూపిస్తోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ , ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య , నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ లలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్టేర్ వీరయ్య మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనితో శృతి హాసన్ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో తన రెండు మూవీ లతో తన అభిమానులను అలరించబోతుంది.