మరోసారి ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన వరసు మూవీ యూనిట్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న  విజయ్ , మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తుపాకీ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దళపతి విజయ్ తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి వాటిలో కొన్ని మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా విజయ్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.


ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న దళపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ లో వరిసు పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కాబోతుంది. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే కొంత కాలం క్రితం ఈ మూవీ సంక్రాంతి కి విడుదల అయ్యే అవకాశాలు కాస్త తక్కువ ఉన్నాయి అని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ రోజు దీపావళి సందర్భంగా ఈ మూవీ యూనిట్ కొత్త పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు మరోసారి ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: