వైరల్ అవుతున్న ప్రభాస్ బర్త్డే ఇష్యూ..!!

murali krishna
అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువలా కురిసిందట.

అదే రోజు బిల్లా సినిమా రీ రిలీజ్ కూడా చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలు థియేటర్లలోనే జరుపుకున్నారట.. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. సాధారణంగానే తెలుగు సినీ పరిశ్రమంలో ఏదైనా హీరో పుట్టినరోజు ఉంటే ఇతర హీరోలు కూడా ఆయనను విష్ చేస్తూ ఉంటారు.

అది సర్వసాధారణమైన విషయమే కానీ ఈసారి ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో టాప్ హీరోలుగా చలామణి అవుతున్న వారు ఎవరూ ఆయనను విష్ చేస్తూ ఒక్క పోస్ట్ చేయకపోవడం గమనార్హం. తెలుగులో విక్టరీ వెంకటేష్, రామ్ పోతినేని వంటి హీరోలు అలాగే పాయల్ రాజ్ పుత్, కృతి సనన్ వంటి హీరోయిన్లు తప్ప ప్రభాస్ ను ఎవరూ ఎందుకు విష్ చేయలేదు? అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి గతంలోనే మన హీరోలు కొంతమంది వెళ్లి బాలీవుడ్ లో సినిమాలు చేసి వచ్చినా సరే పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ ని పరిచయం చేసిన బాహుబలి సినిమాతో ప్రభాస్ కి మంచి క్రేజ్ అయితే లభించింది.

నార్త్ లో కూడా ప్రభాస్ అంటే ఎవరో తెలుసు, అలాగే ప్రభాస్ సౌమ్యమైన స్వభావం చూసి వారు కూడా ఎక్కువ మంది అభిమానులుగా మారారు. ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ని చూసి మన హీరోలకి అసూయగా ఉందని ప్రభాస్ అభిమానులు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ప్రభాస్ కి సోషల్ మీడియా అకౌంట్ లేదు అలాగే ఇంస్టాగ్రామ్ లో కూడా ఉండడు కాబట్టి సోషల్ మీడియా వేదికగా విష్ చేసి ఉండకపోవచ్చు వారు నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి ఉండవచ్చు కదా ఈ విషయం మీద అనవసర రాద్ధాంతం చేయకండి అంటూ కామెంట్లు చేస్తున్నారట.

మొత్తానికి ప్రభాస్ పుట్టినరోజు విషెస్ వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైందట.ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడంతో హీరోలు ఎవరు విష్ చేయకపోవచ్చు అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: