డీజే టిల్లు సీక్వెల్: ఈసారి డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్?

Purushottham Vinay
అసలు ఏమాత్రం ఎలాంటి అంచనాలు అనేవే లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో ఖచ్చితంగా డీజే టిల్లు ఒకటి. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.ఇక ఈ మూవీతో సిద్దు క్రేజ్ అయితే ఒక్కసారిగా మారిపోయింది. బాగా పెరిగిపోయింది. ఇక ఇందులోని డైలాగ్స్.. క్యాచీ పంచ్‏లు జనాలను ఆకట్టుకున్నాయి. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో అట్లుంటది మరి మనతోని అంటూ డీజే టిల్లు డైలాగ్ వాడేసాడు. ఇక ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో.. ఈ చిత్రంపై అంచనాలు కూడా చాలా భారీగా పెరిగిపోయాయి. డీజే టిల్లు చిత్రానికి మించి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో దీపావళి పండగను పురస్కరించుకుని డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టైటిల్ ప్రకటించారు మేకర్స్.



టైటిల్ రిలీవ్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ చిత్ర నిర్మాణ సంస్త సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ సీక్వెల్ కు 'టిల్లు స్క్వేర్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈసారి డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందట. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ స్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.మొదటి భాగంలో హాట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించి యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక అనుపమ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.ఇక సినిమా ఎంత బాగా ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి. కానీ సినిమాకి అయితే ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. కొంచెం శ్రద్ధ పెట్టి తీస్తే మళ్ళీ ఖచ్చితంగా డబల్ బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: