తెలుగు అగ్ర కథానాయికలలో ఎక్కువగా వినిపించే పేరు సమంత..వరుస హిట్ సినిమా లలో నటిస్తూ బిజీగా వుంది.అయితే నాగచైతన్య నుంచి గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి.నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది.నిప్పు లేకుండా పొగరాదులే బాసూ అన్నట్టుగా.. సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల సద్గురు ఆమె కోసం ఓ సంబంధం వచ్చారని వార్తలు వచ్చాయి. నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఈ గురువుగారే దగ్గరుండి బాగు చేశారని. ఆయన చొరవతోనే సమంత రెండో పెళ్లికి ఒప్పుకుందని..పెళ్లి కొడుకుని కూడా సద్గురు చూశారంటూ పుకార్లు షికారు చేశాయి. ఇది నిజమా? అయితే పెళ్లికి సద్గురుకి సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పాయి. అసలు సమంతకి రెండో పెళ్లి ఆలోచనలోనే లేదని.అన్నారు. అయినప్పటికీ కూడా పెళ్లికి సంబంధించి పుకార్లు ఆగడం లేదు.
తాజాగా సమంత తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. అతనికి సమంత మాదిరిగా రెండో పెళ్లే. ఫస్ట్ భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్‌గా ఉంటున్నాడు.అతని ప్రవర్తన సామ్ కు బాగా నచ్చింది..అతగాడిని చేసుకునేందుకు ఈ అమ్మడు ఓకే అనేసిందట. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీన అధికారికంగా విడుదల చేస్తామని ప్రకటించారు. కాని వాయిదా వేశారు. యశోద సినిమా నవంబర్ 11న విడుదలయ్యే అవకాశాఉంది . విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొంటుంది. అలానే కొన్ని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటించనుంది..