తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న కార్తి "యుగానికి ఒక్కడు" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కార్తీ నటించిన అనేక సినిమాలను తెలుగు లో విడుదల చేయగా , అందులో ఆవారా , నా పేరు శివ , ఖాకీ , ఖైదీ వంటి మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడంతో కార్తీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా , రాసి కన్నా ఈ మూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషల్లో చాలా గ్రాండ్ గ విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 87 లక్షలు .
సీడెడ్ : 23 లక్షలు .
ఆంధ్ర : 90 లక్షలు .
రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్ , 3.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.