సాయి పల్లవిని ఆ డైరెక్టర్ మరీ అంతలా మోసం చేశాడా..?
ప్రజెంట్ అలాంటి పరిస్థితిలోనే ఉంది హీరోయిన్ సాయి పల్లవి. ఎందుకంటే సాయి పల్లవి ఈ మధ్యకాలంలో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈమెను ఏ ఒక్క దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోవడం లేదు. సినిమా అవకాశాలు రావడం లేదు. కొన్ని సినిమా అవకాశాలు ఆమె దగ్గరికి వచ్చినా కూడా ఆమె ఓకే చేయడం లేదు. ఈ విషయం పక్కన పెడితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల సాయి పల్లవి ని దూరం పెడుతున్నట్లు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.వాస్తవానికి సాయి పల్లవి ఫిదా సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈ డైరెక్టరే.ఆ మొదటి సినిమాతోనే సాయి పల్లవి కి మంచి స్టార్డమ్ వచ్చిందిఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోనే లవ్ స్టోరీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
అయితే మూడో సారి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ తో తీయబోయే సినిమాలో సాయి పల్లవి ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ లిస్టు నుండి తీసేసినట్టు వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఎందుకంటే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ఓ తమిళ అమ్మాయి ని ఎంపిక చేసుకోబోతున్నారని సమాచారం. అంతే కాదు ఖచ్చితంగా ఈ సినిమాలో సాయిపల్లవి నటించడం లేదు అంటూ సినిమా యూనిట్ నుండి కూడా సమాచారం అయితుంది. అయితే ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి చేస్తున్న వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా హ్యాండ్ ఇచ్చాడు అంటూ ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఏదిఏమైనప్పటికీ సాయిపల్లవి లాంటి టాలెంటెడ్ హీరోయిన్ కి అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి హ్యాండ్ ఇవ్వడం పట్ల శేఖర్ కమ్ముల పై మండిపడుతున్నారు ఆమె అభిమానులు