పుష్ప 2 బడ్జెట్ కు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు....!!
ఈ వ్యాపార సూత్రం ఇండస్ట్రీ వర్గాలకు తెలిసినప్పటికీ ఒకొక్కసారి సినిమా పై ఉండే మితిమీరిన విశ్వాసంతో భారీ బడ్జెట్ ఖర్చుపెట్టిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. అయితే అలాంటి భారీ సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ ఆసినిమాల నిర్మాతలకు అదేవిధంగా ఆసినిమా బయ్యర్లకు లాభాలు వచ్చిన సందర్భాలు చాల తక్కువ అని అంటారు.
ఇప్పుడు అదే విషయం 'పుష్ప 2' విషయంలో రిపీట్ అవుతుందా అంటూ ఇండస్ట్రీలోని కొందరు ఒకరితో ఒకరు గుసగుసలు ఆడుకుంటున్నట్లు టాక్. ఇప్పుడు 'పుష్ప 2' గురించి హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకి చాల భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈసినిమా ఖర్చులకు సంబంధించి బయటకు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పై తీసిన ఫోటో షూట్ కు బాలీవుడ్ ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ ను రప్పించి తీయించినట్లు టాక్. ఇది చాలదు అన్నట్లుగా ఈసినిమాకు సంబంధించిన పోష్టర్ డిజైనింగ్ కు కూడ ఆల్ ఇండియా ఫేమ్ డిజైనింగ్ ఆర్టిస్టులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఈసినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ కు అదేవిధంగా రష్మిక కు ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ కు 'పుష్ప' పార్ట్ వన్ కంటే 'పుష్ప' పార్ట్ 2కు సంబంధించి రెట్టింపు పారితోషికాలు ఇస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ లెక్క చూసుకుంటే 'పుష్ప' పార్ట్ 2 ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తే ఆమూవీ నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటాడు అంటూ అప్పుడే ఇండస్ట్రీలో లెక్కలు మొదలైపోయాయి..