శృతి హాసన్ కు ఆ ఆఫర్.. సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతోందిగా...!!

murali krishna
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
అంతేకాకుండా టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే గత ఏడాది రవితేజ నటించిన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె చేతినిండా వరుస పాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలకృష్ణ సరసన వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. ఇలా ఉంటే తాజాగా శృతిహాసన్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే శృతిహాసన్ ఒక అంతర్జాతీయ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇదే విషయాన్ని శృతిహాసన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

ఇంటర్నేషనల్ మూవీ ది ఐ సినిమాలో శ్రుతి హాసన్ నటించనుంది. ఇందులో మార్క్ రౌలీ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాకూడా డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ అంతర్జాతీయ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందనుంది. ఈ సందర్భంగా శృతిహాసన్ సోషల్ మీడియాలో ఒక .. గ్రీస్ లో ఎందుకు ఉన్నానో మీకుతెలుసా. ఆసక్తికరమైన ప్రాజెక్టులో నేను భాగం అయ్యాను. ఈ శుభవార్తను మీ అందరికి చెప్పడానికి సంతోషిస్తున్నాను అని రాసుకొచ్చింది శ్రుతి హాసన్.

ప్రతి రోజు ఇలాంటి తెలుగు వార్త విశేషాలు కోసం తెలుగుస్టాప్ ని ఫాలో అవ్వండి .ఈ ఆర్టికల్ ని తోటి తెలుగు మిత్రులకి షేర్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: