'కాంతరా' కాన్సెప్ట్ తో వచ్చి.. గతంలో ఓ సినిమా ఫ్లాప్ అయ్యిందా?
ఇలా సినిమాల్లో మాకు కావాల్సింది స్టార్ హీరోలు కమర్షియల్ ఎలిమెంట్స్ కాదు బలమైన కథ కథనం అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు.. ఇక ఇటీవల కన్నడ మూవీ కాంతారా విషయంలో కూడా ఇదే జరిగింది. మొదట కేవలం కోలీవుడ్ లో మాత్రమే విడుదలైన కాంతారా ఆ తర్వాత అక్కడ హిట్ కావడంతో మిగతా భాషల్లో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో కాంతర కలెక్షన్స్ రాబడుతుంది.
అడవిలో ఉండే ఓ తెగ వాళ్లకు చెందిన ఆచారాన్ని ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ గా చూపించారు అని చెప్పాలి. కాకపోతే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా దర్శకుడు రిషబ్ శెట్టి జోడించాడు. అదే సమయంలో తాను రాసుకున్న కథ కావడంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇకపోతే అచ్చం ఇలాంటి కాన్సెప్ట్ తోనే గతంలో కూడా ఒక కన్నడ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు పింగార. ఈ సినిమా కన్నడ మరియు తులు భాషల్లో తెరకెక్కించగా దిగువ కులాల నిరసనకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి చూపించారు. కానీ కమర్షియల్ హంగులు లేకపోవడంతో సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు అని చెప్పాలి. కానీ ఎన్నో జాతీయ అవార్డులు మాత్రం దక్కించుకుంది.