ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్
హీరోయిన్ అయిన
శృతి హాసన్ కొద్ది రోజులు సినిమాలకు దూరం అయ్యింది.ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.ఇప్పటికే రెండు
సక్సెస్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.ప్రస్తుతం యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తుంది.ఈ మూవీతో పాన్
ఇండియా స్టార్‌గా మారనుంది.. ఇదే కాకుండా..
మెగాస్టార్ చిరంజీవి..
డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న మెగా 154 లో.. నందమూరి
బాలకృష్ణ ప్రధాన పాత్రలో..
డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహరెడ్డి మూవీలో నటిస్తోంది. ఇటు తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. తాజాగా క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.
డైరెక్టర్ డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో రాబోతున్న
అంతర్జాతీయ ది ఐ చిత్రంలో శ్రుతి కీలకపాత్ర పోషించనున్నారు. ఫింగర్‌ప్రింట్ కంటెంట్ నుండి వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో శ్రుతికి జోడిగా ది లాస్ట్ కింగ్‌డమ్ ఫేమ్ నటుడు మార్క్ రౌలీ కనిపించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వెబ్ సైట్ డెడ్ లైన్ ప్రకటించింది. ఈ వార్తను శ్రుతి తన సోషల్
మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.ది ఐ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కథలు చెప్పడం..
ఈ ప్రపంచంలో నాకు అన్నింటికంటే బాగా ఇష్టమైన విషయం. ఇప్పుడు అందులో భాగం అయ్యాను అని రాసింది. ఓ దీవిలో మరణించిన తన
భర్త అస్తికల కోసం తిరిగి అక్కడకు వెళ్లిన ఓ
యువ వితంతువు నేపథ్యంలో సాగే సైకలాజికల్
థ్రిల్లర్ గా రాబోతుంది. ఇందులో
హాలీవుడ్ నటీనటులు.. అన్నా సవ్వా, లిండా మార్లో, క్రిస్టోస్ స్టెర్గియోగ్లో కూడా నటించనున్నారు. ఈ నెలాఖరులో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది..ఈ
సినిమా శృతికి ఏ మాత్రం పేరును తీసుకొని వస్తుందో చూడాలి..ఇది కూడా హిట్ అయితే మాత్రం అమ్మడు స్పీడ్ కు బ్రేక్స్ ఉండవు..