మాట తప్పిన బాలయ్య.. అసలు కారణం ఇదే..!
అలాగే విశ్వక్ సేన్ తండ్రి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ నూటికి నూరు శాతం తాను చెప్పిందే కరెక్ట్ అవుతుందని అనుకుంటాడు అని వెల్లడించారు. నేను ఎంత చెప్పినా వినడని.. ఒక్కోసారి నన్ను కూడా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుందని ఆయన తండ్రి వివరించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తల్లిదండ్రులతో ఉండడానికి కూడా సమయం దొరకడం లేదని కామెంట్లు చేశారు. 2023 జనవరి నుంచి నెలలో పది రోజులు ఇంటికి కేటాయిస్తానని కూడా తెలిపారు. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను కూడా నా భార్య వసుంధరకు ఎన్నో ఒట్లు వేశాను. ప్రతి ఆదివారం నేను పని చేయనని చెబుతానని.. కానీ ఆ మాటను నిలబెట్టుకోనని కామెంట్లు చేశారు.
ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య 107వ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి.