జపనీస్ లాంగ్వేజ్ లో స్పీచ్ ఇచ్చి ఆశ్చర్య పరిచిన జూ. ఎన్టీఆర్...!!
జపనీస్ లాంగ్వేజ్‌లో ట్రిపులార్ సినిమాని విడుదల చేశారు. ఫ్యాన్స్ తో కలిసి రాజమౌళి, తారక్, చెర్రీ దంపతులు అంతా ట్రిపులార్ సినిమా చూశారు. ఈ జపాన్ ట్రిప్‌లో జూనియర్ ఎన్టీఆర్ అందరినీ సంబ్రమాశ్యర్యాలకు గురి చేశాడు. నిజానికి తారక్ తెలుగు, ఇంగ్లీష్, హిందా, కన్నడ, తమిళ్ భాషలు మాట్లాడతాడని అందిరీక తెలిసిందే. ఇప్పటికే ఆ భాషల్లో చాలా స్పీచ్‌లు ఇచ్చి ఉన్నాడు కూడా. అయితే తాజాగా తన లాంగ్వేజ్ బుక్‌లో ఇంకో కొత్త భాషను చేర్చుకున్నాడు. జపాన్‌లోని ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ కొంత స్పీచ్ జపనీస్ భాషలో చెప్పుకొచ్చాడు. ఎంతో స్పష్టంగా తారక్ జపనీస్ భాషలో మాట్లాడటం, వారి పదాలను స్పష్టంగా పలకడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు.. జపాన్‌లోని ఫ్యాన్స్ సైతం జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన సర్‌ప్రైజ్‌కి ఫిదా అయిపోయారు.
తారక్ మాట్లాడుతూ.. “ నేను కొన్ని మాటలు జపనీస్ భాషలో మాట్లాడతాను. అందులో ఎలాంటి తప్పులున్నా నన్ను మన్నించండి. నేను మొదటిసారి జపాన్ వచ్చాను. నా మదిలో చాలా తిరుగుతున్నాను. జపాన్‌కి రావాలి అనేది నాకు ఎంతో ముఖ్యమైనది. నేను జపాన్‌కి వచ్చాక ఈ దేశంపై నా అభిప్రాయం మొత్తం పూర్తిగా మారిపోయింది. ఎంతో మంచివారు, ఉదార స్వభావం కలిగిన వాళ్లు జపాన్‌లో నివసిస్తూ ఉంటారు. నాకు జపాన్ ఎంతగానో నచ్చింది. ఇక్కడున్న ప్రజలను నేను ఎంతగానో అభిమానిస్తున్నాను” అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఎన్ని భాషలు వచ్చు అన్నా నీకు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ స్పీకింగ్ స్కిల్స్ కి అంతా ఫిదా అవుతున్నారు.