23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్న ఒకప్పటి నటుడు....!!
మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మా యితో ఆయన వివాహం జరిగిందట. ఈ పెళ్లి కూడా చాలా సీక్రెట్‌గా జరిగిందట. పృధ్వీరాజ్ రెండో భార్యతో కలిసి ఉంటున్నారట. ఈ మేరకు తమిళ మీడియా కోడై కూస్తోంది. అతి త్వరలో రెండో పెళ్లి గురించి పబ్లిక్కు చెప్పనున్నారట. మరి, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే పృధ్వీరాజ్నుంచి కన్ఫర్మేషన్ రావాల్సిందే. కాగా, 57 ఏళ్ల పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లయింది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఆ బాబు పేరు అహద్. పృధ్వీ దంపతులకు అహద్ ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డ విషయంలో తీవ్ర విషాదాన్ని అనుభవిస్తున్నారు.
తాజాగా, ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడు తూ.. ‘‘ నా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. వాడు ఎవరితోనూ కలవాలని అనుకోడు. వాడి ప్రపంచంలో వాడు సంతోషం గా ఉంటాడు. ప్రస్తుతం అతడికి 27 ఏళ్లు. చాలా చక్కగా ఉన్నాడు. అన్నీ బాగా అర్థం చేసుకుంటున్నాడు. అతడికి మాట రాదు. కానీ, అన్నీ బాగా అర్థం చేసుకుంటాడు. బాబు విషయంలో నా భార్య చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అహద్‌కు రూల్స్ పెడుతుంటుంది. నేను ఆ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటా’’ అని అన్నారు.