దారుణంగా పడిపోయిన ఇనాయ సుల్తానా గ్రాఫ్....!!
అయితే ఆ తర్వాత సూర్య తో ప్రేమాయణం నడిపి తన ఫోకస్ ఆట మీద నుండి సూర్య వైపు మరిలించింది..ఇక అక్కడి నుండి ఈమె గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది..ఇక ఈ వారం అయితే ఈమె అసలు ఏమి ఆడలేదు అనే చెప్పాలి..ఎంటర్టైన్మెంట్ టాస్కులో కానీ..కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ మరియు సర్వైవల్ టాస్కులో కానీ ఈమె విరగబడి ఆడినట్టు దాఖలాలు కనిపించలేదు..దీనితో ఆమె గ్రాఫ్ పాతాళలోకం లోకి పడిపోయింది..ఇదే తీరుతో ఆమె ఆట కొనసాగిస్తే మాత్రం ఈ వారం ఎలాగో సేఫ్ అవ్వుద్ది కానీ,వచ్చే వారం నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవ్వక తప్పదు.
టాస్కుల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా అందరికంటే వెనకబడిన వాసంతినే తన ఆట తీరుని మెరుగుపర్చుకొని మరింత బలంగా ఆడదానికి ప్రయత్నిస్తుంది..కానీ ఇనాయ సుల్తానా మాత్రం తన గ్రాఫ్ ని తగ్గించుకుంటూ పోతుందని అంటున్నారు విశ్లేషకులు..హౌస్ లో చివరి వరుకు సాగే కంటెస్టెంట్స్ లో ఒకరు అనుకుంటే ఇప్పుడు మధ్యలోనే వెళ్లిపోయే రేంజ్ కి వచ్చేసింది అంటూ ఆమెని అభిమానించే వారు వాపోతున్నారు.