హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన శృతి హాసన్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక ఆమెకి బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి ఎంట్రీ దక్కింది కానీ సక్సెస్ లేక ఢీలా పడ్డ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తో తన ఫస్ట్ సూపర్ హిట్ కొట్టి పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది.అప్పటి నుండి వెనక్కు తిరిగి చూసుకోకుండా ఈ హాట్ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తాను వద్దు అనుకుంటే తప్ప గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలను ఈమె చేస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు లో సీనియర్ స్టార్ హీరోలు అయిన బాలయ్య మరియు చిరంజీవికి జోడీగా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా ప్రభాస్ తో సలార్ సినిమాలో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో ఇంత బిజీగా ఉన్న శృతి హాసన్ కు మరిన్ని సినిమా ల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.


ఈ సమయంలోనే ఈమెకు ఏకంగా హాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఎట్టకేలకు ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. బాలయ్య మరియు చిరంజీవిలతో సినిమాలు పూర్తి అయిన తర్వాత హాలీవుడ్ లో 'ది ఐ' అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటించబోతుంది. అందమైన ఈ హాట్ బ్యూటీకి దక్కిన ఈ ఆఫర్ గురించి అధికారికంగా ప్రకటించింది.ఒక ద్వీపం లో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో శృతి హాసన్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఇది ఆమెకు హాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లాంటి మంచి పేరును తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని ఆమె అభిమానులు ఇంకా అలాగే కమల్ హాసన్ వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి శృతి హాసన్ కూడా పెద్ద గ్లోబల్ స్టార్ అవుతుందో లేదో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: