ధనుష్ "సార్" మూవీ వాయిదా పడనుందా..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ హీరో ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా ధనుష్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.


ఈ మూవీ లో సంయుక్త మీనన్ , ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది అని ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన కాకుండా 2023 వ సంవత్సరంలో విడుదల చేయాలని మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: