నందమూరి
బాలకృష్ణ ప్రస్తుతం లతో పాటు ఆహా కోసం ఒక టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో ను ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలబెట్టారు బాలయ్య.తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లను తికమకపెడుతూ ఎంతో సరదాగా సాగింది అన్ స్టాపబుల్ సీజన్ వన్. టాక్ షోలన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ.
సూపర్ స్టార్ మహేష్ బాబు,
నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,
మాస్ మహారాజ
రవితేజ ఇలా పలువురు స్టార్స్ తో తన మాటలతో.. సరదా సంభాషణలతో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఘనంగా సీజన్ 2 ను ప్రారంభించింది. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ పూర్తి చేసుకొని ఇప్పుడు రెండో సీజన్ లోకి అడుగుపెట్టింది. తొలి
ఎపిసోడ్ కు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. ఇక రెండో
ఎపిసోడ్ లో యంగ్ హీరోలు
విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ ఫుల్
ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది.
ఈ ప్రోమోలో బిగ్ ఇన్సల్ట్ మీ లైఫ్ లో ఏంటి అని
హీరో సిద్ధుని
బాలయ్య అడగ్గా.. మొహం మీద మార్చలేసుకొని నువ్వు
హీరో అవుతావా అంటూ నవ్వారు అని చెప్పాడు.. దాంతో
బాలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అంటూ సిద్దు చెప్తుండగానే అతడ్ని హగ్ చేసుకున్నారు బాలయ్య. ఆ తర్వాత
విశ్వక్ సేన్ లైఫ్ లో వచ్చిన బిగ్ ట్రబుల్ ఏంటి అని అడగ్గా.. తన అక్క హాస్పటల్ లో జాయిన్ అయ్యారని.. రాత్రి 1 గంటవరకు హాస్పటల్లో ఉండి ఉదయాన్నే 6 కి సెట్ కు వెళ్లానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.