రష్మిక కోసం బాలకృష్ణ ఎదురు చూపులు !

Seetha Sailaja

‘అన్ ష్టాపబుల్ 2’ సీజన్ చాల ఘనంగా ప్రారంభం అయింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో బాలయ్య చేసిన మొదటి షో ఎపిసోడ్ కు అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ఏకంగా 20 లక్షల వ్యూస్ ‘ఆహా’ కు రావడం రికార్డ్ గా చెపుతున్నారు. ఇప్పుడు ఇదే స్పీడ్ ను మరింత కొనసాగించి ఈ షోను మరింత సక్సస్ చేయాలని బాలయ్య ఉత్సాహంతో పరుగులు తీస్తున్నాడు.



దీనిలో భాగంగా ఈ వీకెండ్ లో స్ట్రీమ్ కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ లో బాలయ్య క్రేజీ యూత్ స్టార్స్ విశ్వక్ సేన్ సిద్దు జొన్నలగడ్డ తో ఒక ఆట ఆదుకున్నాడు. ఈ సందర్భంలో బాలయ్య సిద్దూ ను ఒక ఆట పట్టిస్తూ అతడికి ఎవరి పై క్రష్ ఉంది అన్న ప్రశ్న అడిగితే సిద్దు తనకు కియారా అద్వాని పై ఎప్పటి నుంచో క్రష్ ఉందని చెప్పాడు. ఇదే అవకాశంగా తీసుకుని సిద్దూ బాలయ్య ను ఇరికించడానికి ప్రయత్నించాడు.



బాలయ్యకు ఏ హీరోయిన్ పై క్రష్ ఉంది అని ప్రశ్నించినప్పుడు బాలయ్య ఒక్క క్షణం ఆలోచించకుండా తనకు రష్మిక పై ఉన్న క్రష్ ను బయట పెట్టాడు. తాను ఎప్పటి నుండో రష్మిక తో నటించడానికి ప్రయత్నిస్తున్నానని అంటూ ఆమెను వదలను అంటూ జోక్ చేసాడు. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా కొనసాగుతున్న రష్మిక డేట్స్ దొరకడం టాప్ యంగ్ హీరోలకు కూడ సమస్యగా మారింది.



ఇలాంటి పరిస్థితులలో నందమూరి బాలయ్య కోరికను ఎంతవరకు రష్మిక తీర్చగలదో చూడాలి. ఇదే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో లో బాలయ్య త్రివిక్రమ్ కు ఫోన్ చేసి తన షోకు ఎప్పుడు వస్తున్నారు అని అడగడమే కాకుండా ‘ఆయనను కూడ తీసుకురండి’ అని అనడంతో ఈ షోకు త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ మళ్ళీ ఊహాగానాలు జోరు అందుకున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: