ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యేనా..!!

Divya
హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ ని చవి చూసింది. దీంతో దాదాపుగా మూడేళ్లు శ్రమించిన కష్టం మొత్తం విఫలం కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తన ఆశలన్నీ గల్లంతయ్యాయని చెప్పవచ్చు. దీంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో భారీ స్థాయిలో చేయాలనుకున్న జనగణమన సినిమా పక్కన పెట్టవలసి వచ్చింది. ఇక ఈ సినిమాని పక్కన పెట్టి విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్మాణదర్శకత్వం లో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సమంత నటిస్తోంది.

ఈ చిత్రంలోని కోన్ని సన్నివేశాలు కాశ్మీర్ తో పాటు హైదరాబాదులో కొన్ని కీలకమైన షూటింగ్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం. ఇదంతా ఇలా ఉండగా విజయ్ దేవరకొండ తో క్రేజీ ప్రాజెక్టుని ప్రారంభించాలని డైరెక్టర్ హరీష్ శంకర్ పలు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ రీసెంట్గా శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్టు కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే ఈ వార్తలు నిజమో లేదో తెలియదు కానీ..రౌడీ హీరో మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదని వార్తలు కూడా ప్రచారంలో జరుగుతున్నాయి. అయితే ఈ వార్తలపై హరిశంకర్,విజయ్ దేవరకొండ ని కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని అయితే మా కలయికపై మీడియాలో పలు కథనాలు వినిపిస్తూ ఉన్నాయని.. తెలియజేశారు. దీంతో త్వరలోనే వీరిద్దరి క్రేజీ కాంబోలో సినిమా అవడం ఖాయమని చెప్పకనే చెప్పారని విజయ్ దేవరకొండ అభిమానులు భావిస్తున్నారు. మరి అందరిలో ఆసక్తి రేపిస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యేనా అన్న విషయం మరొక కొద్ది రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: