చిరు, ప‌వ‌న్ కంటే బ‌న్నీనే పెద్ద హీరో..వైరల్ అవుతున్న ఆర్జీవీ కామెంట్లు..!

murali krishna
మెగా ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ ఇంటి నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో ల్లో ఎక్కువ‌గా ఆ ఇంటి నుంచే ఉన్నార‌ని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఒంట‌రి గా వ‌చ్చి ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరో అయి పోయాడు. ఆయ‌న త‌ర్వాత వ‌చ్చిన ప‌వ‌న్ కూడా పెద్ద హీరో అనిపించు కున్నాడు.చిరుతో స‌మానం తో ఫ్యాన్ ఫాలోయిం గ్‌ను తెచ్చు కున్నాడు ప‌వ‌ర్ స్టార్‌. ఇక ప‌వ‌న్ త‌ర్వాత వ‌చ్చిన బ‌న్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అనిపించు కున్నాడు. రీసెంట్ గా పుష్ప సినిమా త‌ర్వాత ఆయ‌న ఇమేజ్ అమాంతం డబుల్ అయిపోయింది. పుష్ప సినిమా త‌ర్వాత ప‌వ‌న్ సినిమా భీమ్లా నాయ‌క్ రిలీజ్ అయింది. ఈ సినిమా స‌మ‌యం లో ఆర్జీవీ చేసిన కామెంట్లు ఇప్పుడు మ‌రోసారి వైర‌ల్ అవు తున్నాయి.పుష్ప సినిమాను ఆర్జీవీ ఆకాశాని కి ఎత్తే శాడు. బాలీవుడ్ ‌ను కూడా డీ గ్లామ‌ర్ పాత్ర‌తో బ‌న్నీ దున్నేశాడంటూ పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురిపించాడు ఆర్జీవీ. అయితే ఇదే స‌మయంలో అటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ను కూడా టార్గెట్ చేశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ మీద సెటైర్స్ వేశాడు ఆర్జీవీ. నేను చెప్పిన‌ట్టే ఈ మూవీని హిందీ లో రిలీజ్ చేస్తున్నారు.

కానీ పుష్ప వ‌సూళ్ల ముందు అన‌వ‌స‌రం గా ప‌రువు పోతుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటే కూడా బ‌న్నీనే పెద్ద హీరో కాబ‌ట్టి ఆయ‌న సినిమా తో భీమ్లా నాయ‌క్ ‌ను పోల్చొద్దు అంటూ దారుణం గా విమ‌ర్శించాడు ఆర్జీవీ. ఆ స‌మ‌యం లో ఆయ‌న చేసిన కామెంట్ల మీద మెగా ఫ్యాన్స్ ఇప్ప‌టి కీ భ‌గ్గుమం టూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: