క్షమాపణలు చెప్పిన విష్ణు ప్రియా..!!

murali krishna
విష్ణు ప్రియ (Vishnu Priya).. ఈ పేరు అందరికీ పరిచయమున్న పేరే. యాంకర్‌గా, హోస్ట్‌గా ఆమె బుల్లితెర ప్రేక్షకులకే కాదు.. సోషల్ మీడియాలో చేసే హడావుడితో ప్రేక్షకులందరి నుంచి అటెన్షన్ సంపాదించుకుందట..


ఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే డ్యాన్స్ వీడియోలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. డ్యాన్స్‌తోనే కాదు.. ఆమె అందాల విందుతోనూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంటుందట.. అలాంటి విష్ణు ప్రియ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఓ వీడియోని కూడా షేర్ చేసి.. ప్లీజ్ నన్ను అన్‌ఫాలో చేయండి అని వేడుకుంది. అదేంటి.. ఈ స్టేజ్‌లో ఉన్న సెలబ్రిటీలు ఎవరైనా ఫాలోయింగ్ కోరుకుంటారట.. కానీ అన్‌ఫాలో చేయమంటుందేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఆమె చెప్పే విషయం వింటే ఆశ్చర్యం కాదు.. బాధేస్తుంది.


ఆమె అలా వేడుకోవడానికి కారణం ఏమిటంటే.. తన ఫేస్‌బుక్ అకౌంట్‌ని (Facebook Account) ఎవరో హ్యాక్ చేసి.. అశ్లీల ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వంటిపై ఒక్క వస్త్రం కూడా లేకుండా.. న్యూడ్‌గా ఉన్న ఆ ఫొటోలను చూసిన వారంతా.. విష్ణుప్రియకు అస్సలు ఏమైంది. మరీ ఇంతగా దిగజారిపోయిందేంటి? అంటూ కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆమెను దూషించడం మొదలెట్టారు. ఆమె ఫొటోలే కాకుండా.. ఆ అకౌంట్‌లో ఇతరుల ఫొటోలు కూడా అదే అశ్లీల అవతారంలో పోస్ట్ అవుతుండటంతో.. ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లుగా అందరికీ అర్థమైంది. మార్ఫింగ్ ఫేస్‌లతో అశ్లీలంగా కనిపించిన ఆ ఫొటోలు.. ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేశాయట. వెంటనే తేరుకున్న విష్ణుప్రియ.. తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ.. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా వివరణ ఇచ్చింది. (Vishnu priya Facebook Account)


''అందరికీ నమస్కారం. నా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్నింగ్ నుంచి నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ కంటెంట్ ఏంటి? అసలు ఏం జరిగింది? అంటూ ఒకటే మెసేజ్‌లు. రెండు మూడు నెలలుగా నేను.. నా అకౌంట్ కోసం ప్రయత్నిస్తున్నా.. ఇంకా అది నా ఆధీనంలోకి రాలేదు. ఇప్పటికి రెండు సార్లు నా అకౌంట్ హ్యాక్ అయింది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి ఆ పేజీపై రిపోర్ట్ చేయండి. అన్‌ఫాలో చేయండి.. ఇది అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నానని. ఆ అసభ్యకరమైన కంటెంట్ (Vulgar Content) విషయంలో అందరినీ నేను క్షమాపణలు కోరుతున్నాను. సారీ.. దయచేసి ఈ మెసేజ్‌ను అందరికీ తెలియజేయగలరు''.. అని విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన వీడియోలో పేర్కొందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: