కోలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ
హీరో యుగానికి ఒక్కడు
మూవీ తో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఇప్పటికే కార్తీ తాను నటించిన ఎన్నో
మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి ఎన్నో విజయాలను
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో రాసి
కన్నా హీరోయిన్ గా నటించగా , పీ ఎస్ మిత్రన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని
అక్టోబర్ 21 వ తేదీన
తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అదిరి పోయే రెస్పాన్స్ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా సర్దార్
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సర్దార్
మూవీ లో కార్తీ 15 గెటప్ లలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సర్దార్
మూవీ లో కార్తీ 15 గెటప్ లలో కనిపించేది ఏదైనా పాట కోసమా ... లేదా సినిమాలో భాగంగానే కార్తీ 15 గెటప్ లలో కనిపించబోతున్నాడా అనేది తెలియాలి అంటే
సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ నుండి చిత్రం బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.