ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఖతర్నాక్ గిఫ్ట్‌ను ఫ్యాన్స్‌కు అందించనుందట టీమ్. దీపావళి పండుగ రోజు వాల్తేర్ వీరయ్య నుంచి అదిరిపోయే రేంజ్లో ఓ టీజర్ రానుందట. కట్ చేసిన టీజర్ మామూలుగా రాలేదని.. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌కు ఈ దీపావళి మాత్రం మంచి బ్లాస్ట్ అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు ఒకప్పటి నటి సుమలత కూడా నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి యూరప్ వెళ్లనున్నారని తెలుస్తోంది. యూరప్‌లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు షూట్ చేయనున్నారట టీమ్.
అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.. ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ అంశం మంచి ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలనీ టీమ్ భావిస్తోంది. అయితే అదే టైమ్‌కు తెలుగులో బాలయ్య 107 కూడా వస్తోంది. వీటితో పాటు ప్రభాస్ ఆదిపురుష్, అఖిల్ అక్కినేని ఏజెంట్, విజయ్ వారసుడు.. ఈ ఐదు సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే.. చిరంజీవి 154, బాలయ్య 107లను నిర్మించేది ఒకే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక మరోవైపు చిరంజీవి సినిమా బహుశా సంక్రాంతి బరిలోంచి తప్పుకోవచ్చని.. లేకపోతే.. పండుగకు అటు ఇటుగా విడుదల అయ్యే ఛాన్స్ ఉండోచ్చని మరో టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగనుందో..