నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో మొట్ట మొదటి సారి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. కెరియర్ లో మొట్ట మొదటి సారి బాలకృష్ణ ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించి నప్పటికీ తన వాక్చాతుర్యంతో అన్ స్టాపబుల్ సీజన్ 1 అద్భుతమైన విజయం సాధించేలా చేశాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం అయ్యింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 ను కూడా బాలకృష్ణ తనదైన రీతిలో ప్రారంభించాడు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 కు మొదటి ఎపిసోడ్ కు గెస్టు లుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు విచ్చేశారు. వీరితో బాలకృష్ణ అనేక ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. ఇది ఇలా ఉంటే ఈ ఎపిసోడ్ ప్రోమో వచ్చినప్పటి నుండి ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంత గానో ఆత్రుత గా ఎదురుచూశారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని మొదటి ఎపిసోడ్ కేవలం 4 రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ ను సాధించినట్లు తాజాగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని మొదటి ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.