ఆ టైటిల్ పై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్న "ఎన్ బి కే 107" మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న బాలకృష్ణ ప్రస్తుతం క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది.


ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. దానితో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమాగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ,  ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టైటిల్ ను అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ యూనిట్ చేసింది. ఈ టైటిల్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ను కూడా నిర్వహించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ రెడ్డి గారు మరియు వీరసింహారెడ్డి అనే రెండు టైటిల్ లను ఈ మూవీ కోసం పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ వీరసింహారెడ్డి అనే టైటిల్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఎన్ బి కే 107 మూవీ కి ఏ టైటిల్ ఫైనల్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: