గీత ఆర్ట్స్' బ్యానర్‌లో గీత ఎవరో చెప్పేసిన అల్లు అరవింద్....!!
తాజాగా గీత ఆర్ట్స్‌లో గీత అంటే ఎవరో రివీల్ చేశారు సంస్థ అధినేత అల్లు అరవింద్. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయనకు గీత ఆర్ట్స్‌లో.. గీత అంటే ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ''గీత' అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందిలో ఉంది. అది నిజమే. నాకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నా గర్ల్‌ఫ్రెండ్ పేరు గీత అనేది నిజం, మా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ అని పెట్టడం నిజం. కానీ ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. అయితే నా స్నేహితులు ఈ రెండింటిని కలిపేసి నన్ను ఆటపట్టిస్తుంటారు'' అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం తమ బ్యానర్‌కు గీత ఆర్ట్స్ పెట్టడం వెనక అసలు కారణమేంటోఆయన వివరించారు.
నిజానికి 'గీత ఆర్ట్స్' అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్‌ను పెట్టింది మా నాన్నగారు (అల్లు రామలింగయ్య). భగవద్గీత బోధన ప్రకారం.. ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాలకు కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. 'గీత'లో చెప్పినట్లుగా సినిమా నిర్మాణ వ్యవహారాలు ఉండటంతో 'గీత ఆర్ట్స్' అని పెడదామని నాన్నగారు అనడం.. అదే ఫైనల్ కావడం జరిగిపోయింది'' అని అల్లు అరవింద్ తెలిపారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల ఆర్ట్స్ అని మార్చొచ్చు కదా అని హోస్ట్ అడగడంతో అప్పటికే ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయని, అందుకేమార్చడం ఎందుకని వదిలేశామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్.