వివాదంపై మంచు విష్ణు ఏమన్నారంటే....!

murali krishna
మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు  ఇటీవల 'అలయ్ బలయ్'  కార్యక్రమంలో మెగాస్టార్ చి రంజీవి ని ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిం దే.వాస్తవానికి చిరంజీవి ఈ విషయాన్ని అక్కడే ముగించినా.. ఆయనని అభిమా నించే వారు మాత్రం.. 'గరికిపాటివారు ఎవరిని ఏం అంటు న్నారో తెలుసుకుని ఉంటే బాగుండేది' అంటూ.. సీరియస్ అవడంతో.. ఈ విషయం వివాదంగా మారింది. మెగా స్టార్‌ని అభిమానించే వారంతా.. ఆయన గొ ప్పతనం తెలుపు తూ.. కొన్ని వీడియోలను సో షల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరికి గరికి పాటి నరసిం హారావు కూడా చిరంజీవితో నేను మళ్లీ మాట్లాడ తానని చెప్పినా.. అభిమానులు మాత్రం ఆగలేదు. ఏదో ఒక రూపేనా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. చివరికి చిరంజీవే రంగంలోకి దిగి.. 'ఆయన పెద్ద వారు.. ఆయన మాటలనిపట్టించుకోవాల్సిన అవసరం లేదు'.. అని చెప్పడంతో.. ఈ వివాదం సద్దుమ ణిగింది. తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు ని ఓ విలేఖరి ప్రశ్నించడంతో.. మరోసారి చిరు-గరికిపాటిల మ్యాట ర్ టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది.
మంచు విష్ణు నటించిన 'జిన్నా' సినిమా ప్రమో షన్స్‌లో చిరు-గరికిపాటిల మ్యాటర్‌పై మాట్లాడాలంటూ ఓ విలేఖరి ప్రశ్నించగా.. ''అలయ్ బలయ్ కార్యక్రమంలో అసలు ఏం జరిగిందో కరెక్ట్‌గా నాకు తెలియదు. చిరంజీవిగారి అభిమానులపై గరికపా టిగారు ఏదో మాట్లా డారు.. అని మాత్రం విన్నాను. కానీ పూర్తి సబ్జెక్ట్ నాకు తెలి యదు. కానీ చిరంజీవిగారితో ఫొటో తీసుకోవడాన్ని.. వాళ్ల అభిమానులందరూ గోల్డెన్ ఆపర్చు నిటీగా భావిస్తారు. చిరంజీవి గారు ఒక లెజెండ్ . ఆయన కనబడితే ఎవరై నా సరే.. పరిగెత్తు కుంటూ ఆయన దగ్గరకు వెళ్లిపో తారు. ఇది సాధారణ విషయం. ఫ్యాన్స్ యాంగ్జయి టీని ఎవరూ ఆపలేరు..'' అని మంచు విష్ణు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: